Hyderabad: కరోనా వైరస్ రాకూడదని చిలుకూరులో ప్రత్యేక పూజలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వ్వాపిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా వ్వాపిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే వేల మందిని పొట్టలో పెట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైరస్ దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా, ఎవరికీ సోకకుండా ఉండాలనే ఉద్దేశంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు ఇదే నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా కరోనా వైరస్ నగరంలో ఎవరికీ సోకకుండా ఉండాలని ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 2 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించినంత సేపు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ధ్యానంలో ఉండిపోయారు. ఈ పూజ నిర్వహణ అనంతరం పవిత్ర తీర్థాన్ని భక్తులందరిపై చల్లారు.
ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ దేశంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా చిలుకూరు బాలాజీ స్వామివారు ముందుంటారన్నారని తెలిపారు. భక్తులు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఆయన తెలిపారు. ఆపద మొక్కుల వాడు అందరినీ కాపాడతాడని తెలిపారు.