తెలంగాణ మహిళలకు సంక్రాంతి కానుక.. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ..!
Telangana: 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్
Telangana: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంక్రాంతి కానుక ఇవ్వాలని నిర్ణయించింది. పండగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మీ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలగనుంది. పండగ రద్దీ దృష్ట్యా 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించారు. ఈనెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.