Data Leak Case: డేటా చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్

Data Leak Case: నిందితులు డేటా ఎవరెవరికి విక్రయించారనే అంశంపై ఆరా

Update: 2023-03-27 05:33 GMT

Data Leak Case: డేటా చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్

Data Leak Case: డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం వేగవంతం చేసింది. 16. 8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. డేటా చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ అయ్యారు. నిందితులు డేటా ఎవరెవరికి విక్రయించారనే అంశంపై ఆరా తీస్తున్నారు. నిందితులకు చెందిన 12 ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏడాది కాలంగా నిందితులు ఈ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించిన సిట్.. చైనా సైబర్ నేరగాళ్లకు డేటా చేరిందా అనే అంశంలోనూ ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News