TSPSC: TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీపై సిట్ ధర్యాప్తు ముమ్మరం
TSPSC: రాజశేఖర్ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ
TSPSC: TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీపై సిట్ ధర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లను మూడు రోజుల కస్టడీలో కీలక సమాచారం సేకరించారు. మరో మారు ముగ్గురు నిందితులు షమీమ్ , రమేష్ , సురేష్ లను 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో ఇక సిట్ దర్యాప్తులో ప్రతి సాక్ష్యాధారాలు కీలకం కానున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు...ఢాక్యానాయక్ చాలా మందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురికి ఏఈ పేపర్లు అమ్మినట్లు దర్యాప్తులో గుర్తించారు సిట్ . మరో వైపు గ్రూప్ 1 పేపర్ లీకేజీలపై ప్రవీణ్ , రాజశేఖర్ లను విచారిస్తున్నారు అధికారులు. టిఎస్పీపిఎస్పీలో పనిచేసే సురేష్, రమేష్ కు స్నేహం కుదురటంతో ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీల వివరాలను రాబడుతోంది సిట్ .
కస్టడీలోకి తీసుకున్న నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మరో ముగ్గురు నిందితులు షమీమ్ , రమేష్ , సురేష్ లను సిట్ అధికారులు విచారించినట్లయితే కేసులో కీలక సమాచారం రాబట్టనున్నారు. వీరి కస్టడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరి అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్ కు రాజశేఖర్ ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్నారు సిట్ బ్రుదం .
ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కీలకంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ కాల్ డేటా తో పాటు బ్యాంక్ అకౌంట్ డీటేల్స్ ను విశ్లేషణ కొనసాగుతోంది. గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారని గుర్తించింది సిట్ . ఢాక్యా నాయక్ దగ్గర నుంచి ఏఈ పేపర్ తీసుకొన్న తిరుపతయ్య.. రాజేంద్రకుమార్‌కు అమ్మినట్లు విచారణలో సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఈ కేసులో దర్యాప్తు ఢాక్యానాయక్ తో ఉన్న లింకులను ఛేదించారు పోలీసులు.
ఇప్పటి వరకు కొనసాగిన దర్యాప్తు మొత్తం మూడు జిల్లాల పరిధిలో మాత్రమే ...ఇక విదేశాల నుంచి వచ్చి గ్రూప్ వన్ పేపర్ రాసిన వారిపై ప్రధాన ద్రుష్టి సారించనున్నారు పోలీసులు.. మరి కొందరికి లుక్ ఔట్ నోటీసులు జారీ కానున్నాయి.