బోధన్‌లో శివాజీ విగ్రహ అల్లర్ల కేసు.. 40మందిపై కేసులు నమోదు...
Bodhan: పోలీసుల ఎదుట లొంగిపోయిన మేయర్ భర్త, టీఆర్‌ఎస్ కౌన్సిలర్ శరత్‌రెడ్డి...
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో శివాజి విగ్రహం ఏర్పాటులో ఆరోపణలు ఎదుర్కొన్న మున్సిపాలిటీ చైర్మన్ భర్త, కౌన్సిలర్ శరత్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు...బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో శివాజి విగ్రహం ఏర్పాటులో రెండువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అల్లర్లకు పాల్పడ్డ 40 మందిపై కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారు.
అనుమతులు లేకుండా విగ్రహ ఏర్పాటులో సహకరించినందుకు.. విగ్రహాన్ని తన రైస్ మిల్లులో పెట్టుకున్నందుకు అధికారపార్టీ కౌన్సిలర్ శరత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన శరత్ రెడ్డికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఎప్పుడు పిలిచినా స్టేషన్ కు రావాలని.. వివాదాస్పద ప్రకటనలు చేయకూడదని.. అనుమతి లేనిదే బోధన్ విడిచి వెళ్లరాదన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఏసీపీ రామారావు తెలిపారు.