కార్తీకమాసంతో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుంచే రాజమండ్రి దగ్గర గోదావరి నదీలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. మరోవైపు గోదావరి తీరంలో శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగాయి
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుంచే రాజమండ్రి దగ్గర గోదావరి నదీలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. మరోవైపు గోదావరి తీరంలో శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగాయి. కోవిడ్ నేపథ్యంలో గోదావరి నదీలో స్నానాలు చేయరాదని అధికారుల నిషేధాలను భక్తులు పట్టించుకోలేదు. వేకువ జామునే పవిత్ర నదీ స్నానాలకు కోసం బారులు తీరారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరిలో కార్తీకదీపాలు వదిలి పూజలు చేశారు.
సోమవారం కార్తీకమాసం కావడంతో శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగాయి. శివుడికి భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. రాజమండ్రి- శ్రీ ఉమామార్కేండేయ స్వామి , కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామర్లకోటలో కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయంలో, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే దర్శనాలకు భక్తులు బారులు తీరారు.