Praneeth Rao: ప్రణీత్‌రావు సస్పెన్షన్‌లో సంచలన విషయాలు

Praneeth Rao: 42 హార్డ్ డిస్క్‌లను రిమూవ్ చేసిన ప్రణీత్‌రావు

Update: 2024-03-05 08:50 GMT

Praneeth Rao: ప్రణీత్‌రావు సస్పెన్షన్‌లో సంచలన విషయాలు

Praneeth Rao: ఫోన్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై సస్పెండ్ అయిన ప్రణీత్‌రావు కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. S.I.B ఆఫీస్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేశారు. 42 హార్డ్ డిస్కులను తొలగించారు. లాకర్ రూంలో ఉన్న ల్యాప్‌టాప్,హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. కీలక నేతలకు చెందిన ఫోన్ టాపింగ్ డేటా, కాల్‌డేటా రికార్డ్‌లను I.M.E.I నెంబర్లను ధ్వంసం చేశారు ప్రణీత్ రావు.

ఎలక్ట్రిషన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించిన ప్రణీత్.. డేటాబేస్‌లో ఉన్న మొత్తం డేటాను రిమూవ్ చేశారు. అయితే.. ప్రస్తుతం సిరిసిల్లలో DCRB డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావ్‌ను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా.. హెడ్ క్వాటర్ విడిచి వెళ్లరాదని ప్రణీత్ రావుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసింది.      

Tags:    

Similar News