Group 4: నేటి నుంచి గ్రూప్- 4 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన.!
Group 4: నేటి నుంచి గ్రూప్ 4 అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
Group 4: రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసు పోస్టుల కోసం 1:3నిష్పత్తి మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 20న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం అవుతుంది. దాదాపు రెండు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో హాజరు కానీవారు , ఏదైనా ధ్రువీకరణ పత్రం సమర్పించనివారు..ఆగస్టు 24,27,31వ తేదీల్లో రిజర్వుడేగా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అలాగే గ్రూప్ 2 దరఖాస్తుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు గురువారంతో ముగియనుందని టీజీపీఎస్సీ తెలిపింది.