Schools Reopen: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూల్స్ రీఓపెన్
Schools Reopen: ఎండల తీవ్రత వల్ల ఏపీలో 6 రోజుల పాటు ఒంటిపూట బడులు
Schools Reopen: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి బడి గంట మోగనుంది. పాఠశాలలకు వేసవి సెలవులు నిన్నటితో ముగియడంతో.. నేటి నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. దీంతో ఇవాల్టీ నుంచి 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సమ్మర్ హాలిడేస్‌ని ఎంజాయ్ చేసిన పిల్లలు.. ఇక నేటి నుంచి బ్యాగ్ పట్టుకుని స్కూల్‌కి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగించాలనే డిమాండ్లు వచ్చాయి.
ఏపీలో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కానుండగా.. ఎండల వల్ల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమ్మర్ సెలవులను పొడిగించే ఆలోచన లేదని, స్కూల్స్ యాధాతధంగా జరుగుతాయని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి స్కూల్స్ పున:ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసింది.