Telangana: జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం
Telangana: తెలంగాణలో అన్ లాక్ పై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం విద్యాసంస్థల ప్రారంభించాలని నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో అన్ లాక్ పై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం విద్యాసంస్థల ప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని కేటగిరిల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్ధతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలల పునప్రారంభంపై ఆన్ లైన్ క్లాసులు కొనసాగించడం.. తప్పనిసరి హాజరు..ఇతర నిబంధనలు విధి విధానాలకు సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలను విడుదల చేయాలని విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.
లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదంది. తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలంది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.