Rythu Runa Mafi: రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ..సర్కార్ సంచలన నిర్ణయం
Rythu Runa Mafi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పారు. రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Rythu Runa Mafi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణలో రుణమాఫీపై రానున్న 3 రోజుల్లో మార్గదర్శకాలను రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో లక్షలాది మందికి మేలు జరుగుతుందని సీఎం అన్నారు. ఒకే విడతలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని..దీనికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండురోజుల తర్వాత రాష్ట్ర బడ్జెజ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఫోకస్ పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం కోసం ఆర్టీసీకి ప్రతినెలా రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.