Sama Ranga Reddy: లింగోజిగూడ డివిజన్‌లో కబ్జాలే తప్ప.. అభివృద్ధి లేదు
Sama Ranga Reddy: బీజేపీ పార్టీ ముంపు సమస్యలు, నియోజకవర్గంలోని ప్రతి కాలనీల ..సమస్యలు తీర్చేందుకు కట్టుబడి సామ రంగారెడ్డి
Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్లో గడపగడపకు బీజేపీ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి లింగోజిగూడ డివిజన్లోని కాలనీల మహిళలు హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని ఈసారి బిజెపిని గెలిపించుకుంటేనే మా సమస్యలు తీరుతాయని చెబుతున్నారన్నారు. లింగోజిగూడ డివిజన్ అంటేనే ముప్పు సమస్య డివిజన్ అని ఇలా కావడానికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కబ్జాలు అని అన్నారు. చిన్న పాటి వర్షానికే కాలనీలు జలమయం అవుతాయని మంత్రి కేటీఆర్ ఎన్నో సార్లు సమస్యలు తీరుస్తానని చెప్పి ఇప్పటికీ చేయలేదని విమర్శించారు. బీజేపీ పార్టీ ముంపు సమస్యలు, నియోజకవర్గంలోని ప్రతి కాలనీల సమస్యలు తీర్చేందుకు కట్టుబడి ఉందని అన్నారు.