Sama Ranga Reddy: సుధీర్‌రెడ్డికి భూ దందాలపై ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు
Sama Ranga Reddy: బీఆర్ఎస్ పాలనలో అన్ని కాలనీలు.. సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి
Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజవర్గంలోని కొత్తపేట డివిజన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి, కార్పొరేటర్ పవన్‌లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని సామా రంగారెడ్డి విమర్శించారు. సుధీర్‌రెడ్డికి భూ దందాలపై ఉన్న ధ్యాస ప్రజల మీద లేదన్నారు. సుధీర్‌రెడ్డి మందు పార్టీలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభపెడుతున్న సుధీర్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి హెచ్చరించారు.