Sama Ranga Reddy: అభివృద్ధి ఎక్కడ?.. వర్షాలు పడితే ప్రాంతాలు మొత్తం జలమైపోతాయి
Sama Ranga Reddy: నన్ను గెలిపిస్తే సమస్యలు లేని గడ్డిఅన్నారం చూస్తారు
Sama Ranga Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి.... గడ్డి అన్నారం డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో కలిసి తమకు మద్దతు తెలిపి.. బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. ఈ డివిజన్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన తెలిపారు. వర్షాలు పడితే ప్రాంతాలు మొత్తం జలమైపోతాయన్నారు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో సమస్య లేదని.. ఒకవేళ వర్షాలు పడితే ఈ ప్రాంతమంతా జలమయమై ఉండేదని సామరంగారెడ్డి అన్నారు. వరద సమస్యల కోసం ఎలాంటి పరిష్కారం ఇప్పటివరకు చేపట్టలేదని కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే చేపట్టారని సామ రంగారెడ్డి ఆరోపించారు. తనని గెలిపిస్తే సమస్యలు లేని గడ్డిఅన్నారం డివిజన్‌ను ప్రజలు చూస్తారని సామరంగారెడ్డి తెలియజేశారు.