సూర్యాపేట జిల్లాలో ప్రమాదం అదుపు తప్పిన ఆటో పదిమందికి తీవ్రగాయాలు

* క్షతగాత్రులను హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించిన స్థానికులు

Update: 2022-11-12 05:02 GMT

సూర్యాపేట జిల్లాలో ప్రమాదం అదుపు తప్పిన ఆటో పదిమందికి తీవ్రగాయాలు

Road Accident: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజుర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బాధితులు అబ్బిరెడ్డిగూడేనికి చెందిన కూలీలుగా గుర్తించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణం చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణంమని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Tags:    

Similar News