Nizamabad: రైస్‌ మిల్లర్లు, వే బ్రిడ్జి నిర్వాహకుల కుమ్మక్కు.. ధాన్యం తూకంలో మోసం

* ఒక్క లారీ లోడుకు 14 కిలోల ధాన్యం తేడా * తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా * రైతులకు మద్దతు తెలిపిన బీజేపీ కార్యకర్తలు

Update: 2021-11-29 04:05 GMT

నిజామాబాద్ (ట్విట్టర్ ఫోటో)

Nizamabad: రైస్ మిల్లర్లు, వేబ్రిడ్జి నిర్వాహకులు చేతులు కలిపి అన్నదాతలను నిండా ముంచుతున్నారు. తరుగు పేరుతో రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఒక్క లారీ లోడుకు 14 కిలోలు తూకంలో తేడా చూపిస్తూ దోచుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఓ వే బ్రిడ్జి నిర్వహకుని ఘరానామోసం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ కార్యకర్తలు మద్దతు పలికారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్‌లో ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటైంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్థానిక కరమ్ ధర్మ కాంటా వద్ద తూకం వేయిస్తున్నారు. కరమ్ ఇండస్ట్రీస్ యజమానే కరమ్ ధర్మకాంట నిర్వహిస్తున్నారు.

తన రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని కరమ్ ధర్మకాంటలో తూకం వేయిస్తూ లారీకి 14 కిలోల వరకు తేడా చూపిస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన తెలియజేశారు.

ఓ వైపు ప్రభుత్వం, అధికారులు చెబుతుంటే, రైస్ మిల్లర్లు మాత్రం రైతులను దోచుకునేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. వే బ్రిడ్జి నిర్వాహకులతో కుమ్మకై ధాన్యం తూకంలో ఏకంగా క్వింటాళ్లలో తేడా చూపిస్తున్నారు.

ఈ తరహా మోసం చేస్తూ కరమ్ ధర్మ కాంటా, కరమ్ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టగా, కడ్తా తీసినట్లు రుజువైంది. దీంతో రైసు మిల్లును సీజ్ చేయడంతో పాటు యజమాన్యంపై కేసులు నమోదు చేశారు. 

Full View


Tags:    

Similar News