Revanth Reddy: అమెరికా నుంచి దక్షిణ కొరియాకు సీఎం రేవంత్ బృందం

Revanth Reddy: రెండ్రోజుల పాటు సియోల్‌లో పలు కీలక సమావేశాలు

Update: 2024-08-11 04:00 GMT

Revanth Reddy: అమెరికా నుంచి దక్షిణ కొరియాకు సీఎం రేవంత్ బృందం

Revanth Reddy: సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణకొరియా పర్యటనకు వెళ్లింది. రెండ్రోజుల పాటు సియోల్‌లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణకొరియా పర్యటన సాగనుంది. ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు... అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ AWS వృద్ధి వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు. దీంతో త్వరలోనే హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది. 

Tags:    

Similar News