Gaddar Awards: గద్దర్ పేరుతో నంది అవార్డులు.. త్వరలో జీవో జారీ చేయనున్న రేవంత్ సర్కార్

Gaddar Awards: హర్షం వ్యక్తం చేసిన గద్దర్ అభిమానులు

Update: 2024-02-01 03:11 GMT

Gaddar Awards: గద్దర్ పేరుతో నంది అవార్డులు.. త్వరలో జీవో జారీ చేయనున్న రేవంత్ సర్కార్ 

Gaddar Awards: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందజేస్తామన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి అంటూ గద్దరు కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్నే అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి అని తెలిపారు సీఎం రేవంత్. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.

ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు సీఎంని కలిసినప్పుడు నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. అయితే నంది అవార్డులు కాదు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఆ నిర్ణయాన్ని ఇప్పుడు గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వివిధ భాషల్లో పరిజ్ఞానం ఉన్న వారికి గద్దర్ అవార్డును అందజేస్తామన్నారు. కవులు, కళాకారులకు ఇవ్వడం ద్వారా.. గద్దర్‌ను స్మరించుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ లెజెండ్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరుమీద ఎవరికి అవార్డు వచ్చినా అదో గొప్ప అవకాశంగా భావించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాటే శాసనం.. మాటే జీవో అంటూ రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ నిర్ణయానికి ప్రజా యుద్ధనౌక అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News