Hath Se Hath Jodo: మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

Hath Se Hath Jodo: సాయంత్రం పస్రాలో కార్నర్ మీటింగ్‌

Update: 2023-02-06 02:13 GMT

Hath Se Hath Jodo: మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం  

Hath Se Hath Jodo: ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంథీ కన్యాకుమారినుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేపట్టి ఆపార్టీలో కదిలిక తీసుకొచ్చారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ ప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించబోతున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానలాలను ఎడగట్టే విధంగా రేవంత్ రెడ్డి పర్యటన చేపట్టబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్‌ పాదయాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మీడియా సమవేశం నిర్వస్తారు.

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే సమ్మక్క, సారలమ్మ గద్దెలకు రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ నియోజవర్గంలో ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయ 11 గంటలకు మేడారం సమ్మక్క, సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ప్రారంభిస్తారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్టు నగర్, పస్రా, రామప్ప గ్రామం వరకు తొలిరోజు పాదయాత్ర జరుపుతారు. పస్రాలో సాయంత్రం కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

రేవంత్ రెడ్డి తలపెడుత్న హాత్ సే హాత్ జోడో యాత్రతతో ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకునేందుకు అవకాశాలున్నాయని ఆ పార్టీ ప్రతినిధులే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాగే జోడో యత్రను అన్ని జిల్లాల్లోని విజయందం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News