Revanth Reddy on telangana projects: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే: రేవంత్ రెడ్డి

Revanth Reddy on telangana project :సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫాంహౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత లోపం

Update: 2020-06-30 16:45 GMT

Revanth Reddy on telangana projects: సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫాంహౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే నాణ్యత లోపం జరిగిందని, ఇతర ప్రాంతాలలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన నియోజక వర్గంలోనే ఇంత ఘోరంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరిగిన కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు రోజుకొకటి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని ఆయన విమర్శించారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.

చిన్న కాలువల పరిస్థితి ఇంత దారునంగా ఉంటే ఇక భారీగా నిర్మించిన 50 టీఎంసీల మల్లన్న సాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, గందమల పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌, గందమల్ల ప్రాజెక్టులకు ఇలాగే గండిపడితే వాటి పరిధిలో ఒక్క ఊరు కూడా మిగలదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్ విమర్శించారు. కేంద్రం, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపాలే నిదర్శనమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండీలు పడ్డాయని గుర్తు చేశారు.


Tags:    

Similar News