Revanth Reddy: సచివాలయంలోకి రేవంత్‌కు అనుమతి లేదంటున్న పోలీసులు
Revanth Reddy: గత నాలుగేళ్లుగా టోల్‌ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారని ఆరోపణ
Revanth Reddy: కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఓఆర్ఆర్ టెండర్‌పై స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌ను ఆయన కలవనున్నారు. ఓఆర్ఆర్ కోసం అప్పట్లో ప్రభుత్వం 6 వేల 6 వందల 96 కోట్లు పెట్టుబడులు పెట్టిందన్న రేవంత్.. గత నాలుగేళ్లుగా టోల్‌ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో కనీసం వెయ్యి కోట్లు చేతులు మారాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. టెండర్ విధానాలపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్. మరోవైపు.. సచివాలయంలోకి రేవంత్‌కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.