KTR: ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్.. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో..
KTR: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
KTR: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో అర్థరాత్రి ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పలువరు నేతలు, కార్యకర్తలు. కేటీఆర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉదయం వరకూ కేటీఆర్ ఇంటి దగ్గరే నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
అయితే కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు. కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఏ రోజైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని ఎద్దేవా చేశారు. అంతకుముందు కూడా పలువురు మంత్రులు... కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.