Revanth Reddy: ఖమ్మంలో నిరుద్యోగ యువతతో కలిసి నిరసన ప్రదర్శన.. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి
Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం
Revanth Reddy: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ చర్యలతో నిరుద్యోగులు ఆగమైపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఖమ్మంలో ఆయన నిరుద్యోగులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. 1969లో ఉద్యోగాలు కావాలని ఉద్యమం ఖమ్మంలోనే ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 50లక్షల నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తే పోలీసు కేసులుపెట్టి నోటీసులు జారీ చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నాపత్రాలకు భద్రత కల్పించలేని మంత్రి కేటీఆర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.