Kishan Reddy: యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు

Kishan Reddy: 2లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో సీఎం చెప్పాలి

Update: 2024-07-20 14:40 GMT

Kishan Reddy: యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు

Kishan Reddy: యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. అవసరం తీరాక.. నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి తీరు బాధాకరం అని, 2లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయో సీఎం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధర్నా చౌక్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నాలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 4వేల నిరుద్యోగభృతి చెల్లించాలని, గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్ 2పోస్టులను 2వేలకు పెంచాలని కోరారు.

Tags:    

Similar News