Revanth Reddy: నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP నాటకం

Revanth Reddy: తెలంగాణ చూస్తోంది. మీ సమాధానం కోసం..!! అంటూ రేవంత్ ట్వీట్

Update: 2023-10-05 11:07 GMT

Revanth Reddy: నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP నాటకం

Revanth Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసును గుర్తు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాడు రాహుల్ యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే BRS- BJP దొంగ నాటకం అడాయని రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు.. BL. సంతోష్ హైదరాబాద్ వచ్చిండటగా అంటూ ట్వీట్ చేశారు రేవంత్. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి..మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా..? ప్రశ్నించారు. ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా..? లేక సిట్‌ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా..? అని పీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు. తెలంగాణ చూస్తోంది. మీ సమాధానం కోసం..!! అంటూ నిలదీశారు రేవంత్.


Tags:    

Similar News