ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడి కేసు.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు...

Remand Report: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలే దాడికి దారి తీశాయి

Update: 2022-11-21 06:09 GMT

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడి కేసు.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు...

Remand Report: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలు పొందుపరిచారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలే దాడికి దారి తీశాయన్నారు పోలీసులు. దాడి చేసిన 9 మందిలో ఇద్దరు phd విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. అర్వింద్‌పై దాడి కేసులో సంబంధం లేని... జాగృతి నవీనాచారి, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పేర్లు ఉన్నాయని తెలిపారు. ఇక పలు ప్రెస్‌మీట్‌లతో కవితను పదేపదే అర్వింద్‌ టార్గెట్‌ చేశారని.. కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే అర్వింద్‌ ఇంటిపై దాడికి ప్లాన్ జరిగిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్‌ ఇంటి వద్ద ఎక్కువ సంఖ్యలో.. బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డారని తెలిపారు. ఇక అర్వింద్‌ ఇంట్లోని పూజ సామాగ్రి, హాల్ ధ్వంసంతో పాటు కారుపై దాడి చేశారన్నారు. నిందితులకు... పోలీసులు 41 CRPC నోటీస్‌ ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Full View
Tags:    

Similar News