Realtors protest : ఎల్ఆర్ఎస్ జీవో 131ని రద్దు చేయాలి : రియల్టర్లు నిరసన
Realtors protest : ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం మరో సారి ఆలోచించాలని కోరారు. ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలనని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచడం అంటే సామాన్యప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. 2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి విఙ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. ఆ తరువాత ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇక పోతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అందరికి కొత్త స్కీం వర్తిస్తుందని మార్గదర్శకాలు జారి చేసింది. ఓవైపు చాలా కాలంగా పెండిగ్‌లో ఉన్న సమస్యకు పులిస్టాప్ పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరనుంది. మరోసారి లే అవుట్ రెగ్యులరైజేషన్ LRS స్కింను ప్రకటించింది. నెలలుగా ఇదే విషయంపై కసరత్తు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు మార్గ దర్శకాలు జారిచేసింది. కొద్ది వారాల క్రితం అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం ప్రజల్లో చర్చనీయాశం అయింది. రిజిస్ట్రేషన్ శాఖ తాజా ఆదేశాలతో రాష్ట్రంలో వేలాది అనుమతి లేని వెంచర్లు, లక్షలాదిగా వెలిసిన అక్రమ నిర్మాణాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించడంతో వారికి ఊరట లభించింది.