సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీ భగ్నం.. పట్టుబడ్డ వారి నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం

Rave Party: మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి STF పోలీస్ అధికారులు రేవ్ పార్టీని భగ్నం చేశారు.

Update: 2024-07-25 13:53 GMT

సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీ భగ్నం.. పట్టుబడ్డ వారి నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం

Rave Party: మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి STF పోలీస్ అధికారులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి బర్త్ డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో STF పోలీస్ అధికారులు దాడి చేశారు.

రేవ్ పార్టీకి వచ్చిన 14 మంది యువకులతో పాటు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు సమాచారం. 

Also Read: రేవ్ పార్టీ అంటే ఏంటి?

Tags:    

Similar News