Ration Cards: తెలంగాణలో 15లక్షల మందికి బిగ్ షాక్.. వారందరికీ రేషన్ కార్డ్ కట్..కారణం ఏంటో తెలుసా?
TG Ration Cards: తెలంగాణ ప్రభుత్వం 15లక్షల మందికి బిగ్ షాక్ ఇవ్వనుంది. ఓ పక్క కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూనే..మరో పక్క ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏకంగా 15 లక్షల మందికి రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
TG Ration Cards: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఆ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టింది. దీంతో చాలా మందికి రేషన్ కార్డులులేవు. రేషన్ సరుకుల నుంచి రకరకాల రుణాలు పొందేందుకు కూడా రేషన్ కార్డే కీలకం. అందుకే తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
తెలంగాణలో దాదాపు 90లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో సుమారు 15లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే చాలా మంది పేదలకు ఇబ్బందులు తప్పేలా లేవు. రద్దు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వం రేషన్ కార్డులను రద్దు చేయడానికి కూడా బలమైన కారణమే చూపుతోంది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో నిజమైన లబ్దిదారులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈకెవైసీ చేపట్టింది. ఇది తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపింది. చాలా మంది ఇంకా చేయించుకోలేదు. చాలాసార్లు ప్రభుత్వం గడువును పెంచినప్పటికీ ఇంత వరకు చాలా మంది చేయించుకోలేదు.
అయితే ఈకేవైసీ జరగకపోవడానికి టెక్నికల్ అంశాలు కూడా కారణంగానే కనిపిస్తున్నాయి. కొంతమంది తమ ఫింగర్ ప్రింట్స్ పడటం లేదని..అందుకే చేయించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. చాలా సార్లు గడువు ఇచ్చినప్పటికీ కేవైసీ పూర్తి కావడం లేదు. అంటే రేషన్ కార్డు దారులు తెలంగాణలో లేకపోయి ఉండవచ్చు లేదంటే అర్హులు కాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 15లక్షల దాకా రేషన్ కార్డులను రద్దు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమచారం. రద్దు చేస్తే ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానుంది. దీనిపై గైడ్ లెన్స్ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోవడం మంచిది. లేదంటే రేషన్ కార్డును రద్దు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.