ACB: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి అరెస్టు

ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్‌ కలెక్టర్‌ రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. డబ్బును సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా జేసీ తీసుకున్నారు.

Update: 2024-08-13 07:10 GMT

ACB: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి అరెస్టు

ACB: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సీనియర్ అసిస్టెంట్ మధన్‌మోహన్‌రెడ్డి కూడా అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రంలోపు ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చనున్నారు. భూపాల్‌రెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

కాగా ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్‌ కలెక్టర్‌ రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. డబ్బును సీనియర్‌ అసిస్టెంట్‌ ద్వారా జేసీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్‌ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్‌లోని జేసీ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Full View


Tags:    

Similar News