Bhadrachalam: భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి కొనసాగింపు

Bhadrachalam: ఈఓగా కొనసాగాలని మరో జీఓ విడుదల చేసిన ప్రభుత్వం

Update: 2024-02-17 15:00 GMT

Bhadrachalam: భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి కొనసాగింపు

Bhadrachalam: భద్రాచలం శ్రీసీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం ఈఓ రమాదేవిని కీసర ఈవోగా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో పట్టణ ప్రజలతో పాటు అనేకమంది శ్రీరామ భక్తులు రమాదేవి బదిలీ నిలిపివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆమెను ఎండోమెంట్ శాఖలో భద్రాచలం రామాలయం ఈఓ గా కొనసాగాలని ప్రభుత్వం మరో జీఓ విడుదల చేసింది. రమాదేవిని ఈఓగా కొనసాగించడం పట్ల భద్రాద్రి ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News