Raj Gopal Reddy: ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కేటీఆర్ నాటకం

Raj Gopal Reddy: అభివృద్ధికోసం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు

Update: 2022-10-15 01:38 GMT

Raj Gopal Reddy: ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కేటీఆర్ నాటకం

Raj Gopal Reddy: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్‌నేత కేటీఆర్ నాటకమాడుతున్నాడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ప్రాంత అభివృద్ధికి సహకరించమని అడుగుదామని ప్రయత్నిస్తే కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రజా సమస్యలను చట్టసభలో ప్రస్తావిద్దామంటే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఉద్యమం కారుడనే ముసుగులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండని మండిపడ్డారు. బెంజ్‌కారులో తిరిగేవారికి రైతు బంధునిచ్చి, కౌలు రైతులకు మొండిచేయిచూపారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ బాగుపడాలంటే... టీఆర్ఎస్‌ను బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Full View
Tags:    

Similar News