తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ఎంట్రీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ఘన స్వాగతం

Bharat Jodo Yatra: మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం

Update: 2022-10-23 04:19 GMT

తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ఎంట్రీ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ఘన స్వాగతం 

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర... తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న గుడబెల్లూర్ లోంచి తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభం అయింది. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలు తెలంగాణ సాంస్కృతిక కళా రూపాలతో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కర్ణాటక ప్రెసిడెంట్ డి కే శివకుమార్ తెలంగాణ ఎంట్రీ వద్ద రాహుల్ యాత్రకు వీడ్కోలు చెప్పి జాతీయ జెండాను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందించారు.

ఉదయం 11గంటలకు నారాయణ పేట జిల్లా గుడబెళ్ళూర్ లో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. దీపావళి కారణంగా 24, 25 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. 26న ఏఐసిసి అధ్యక్షునిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. 27 నుంచి రాహుల్ పాద యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. తెలంగాణలో 12 రోజులు, 375 కిలో మీటర్లు రాహుల్ యాత్ర నిర్వహిస్తారు.

Tags:    

Similar News