Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు కస్టడీ
Phone Tapping Case: ఏడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. ఏడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో.. రేపటి నుంచి 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు రాధాకిషన్‌రావు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.