ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌ : రోజు 100 ట్రిప్పులు నడుపుతున్న మెట్రో

Update: 2019-10-13 02:04 GMT

హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌ మెట్రోపై భారం మోపుతోంది. సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం నడిచిన బస్సులు కూడా అరకొరగా ఉండటంతో ప్రజలు మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ప్రతీ 3 నిమిషాలకు ఓ మెట్రో రైలు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ప్రజలు మెట్రో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయ్‌. అయితే అమీర్‌పేటలో ఇటీవల పెచ్చులూడిన ఘటనను తలుచుకుంటూ ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచారు. అదనంగా రోజు 100 ట్రిప్పులు నడుపుతుంది. మొత్తం 800 పైచిలుకు ట్రిప్పులు నడుపుతుంది. అయినా మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయ్. సమ్మెతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో నగరవాసులకు మెట్రో రైళ్లే దిక్కయ్యాయి. ఆటోలు, ఇతర వాహనాలు రెట్టింపు స్థాయిలో చార్జీలు వసూళ్లు చేస్తుండడంతో మెట్రో రైళ్లను ఆశ్రయించక తప్పలేదు. ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది.

అయితే ఇదే మెట్రో రైళ్ల మధ్య ట్రాఫిక్‌ జామ్‌‌కు కారణమవుతోంది. ఆర్టీసీ సమ్మెతో అధికారులు ఎక్కువ రైళ్లను నడుపుతుండటంతో ఎదురుగా వచ్చే రైల్‌ కోసం ఇంకో రైలును ఆపాల్సి వస్తుంది. ప్రతి మూడు నిమిషాలకు నడుస్తున్న మెట్రోకు అధిక రైళ్లతో జామ్‌ ఏర్పడింది. ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఒక గంట పాటు మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags:    

Similar News