ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరోసారి నిరసన సెగ తాకింది. జనగామ మున్సిపాలిటీ నీళ్లు మళ్లించొద్దంటూ హైదరాబాద్-వరంగల్ హైవేపై నిరసనకు దిగారు యశ్వంతపూర్ గ్రామస్తులు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెక్ డ్యాం నిర్మాణంతో గ్రామానికి ఒరిగేదేమీలేదని ఆరోపిస్తున్నారు.