Telangana: తెలంగాణలో నిండు కుండను తలపిస్తున్న ప్రాజెక్టులు..

Telangana: సింగూరు ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Update: 2023-07-22 04:40 GMT

Telangana: తెలంగాణలో నిండు కుండను తలపిస్తున్న ప్రాజెక్టులు..

Telangana: భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద, 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.296 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇటు సింగూరు ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 9వేల 470 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 385 క్యూసెక్కులగా కొనసాగుతోంది. పూర్తి నీటినిల్వ 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.564 టీఎంసీలుగా ఉంది. తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గిందిజ 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 15వేల 834 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఔట్‌ఫ్లో 12వేల 597 క్యూసెక్కులుగా ఉంది.

Tags:    

Similar News