Vande Bharat Express: తెలంగాణలో అందుబాటులోకి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat Express: నాగ్‌పూర్- సికింద్రాబాద్ సర్వీసు ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Vande Bharat Express: తెలంగాణలో మరో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్- బెంగళూరుల మధ్య వందే భారత్ రైలు దూసుకెళ్తోంది. తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఇవాళ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మహారాష్ట్రలోని సేవాగ్రం, చంద్రపూర్, బల్లార్షతో పాటు తెలంగాణలోని రామగుండం, కాజీపేటలో ఆగనుంది.
దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. వారంలో మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు నడవనుంది. ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు కేవలం మూడు గంటల్లోనే సులభంగా వెళ్లే అవకాశముందని రామగుండం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.