మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్
* గోవింద్‌ను ప్రత్యేకంగా అభినందించిన సీఎం కేసీఆర్ కేటీఆర్ తదితరులు
TRS Party: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. గతంలో నల్లగొండ జిల్లాలో హుజుర్‌నగర్, నాగార్జునసాగర్‌లో విజయం సాధించి మునుగోడుతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా మూడు నెలల ముందే మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో ఎంట్రీ కావడం మునుగోడులో ఇతర పార్టీల నుంచి చేరికల కోసం ప్లాన్ చేసారు. చేరికల ప్లాన్‌లో చందంపేట మాజీ ఎంపీపీ ఎడుపుల గోవింద్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు. మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరొందిన గోవింద్.. మునుగోడులో ఆపరేషన్ ఆకర్ష్‌లో సక్సెస్ అయ్యారని టాక్ మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఇతర పార్టీల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్‌లో చేర్పించడంలో ఎడుపుల గోవింద్ కీలకంగా వ్యవహరించారనే చర్చ నడుస్తోంది.
టీఆర్ఎస్‌లో యువనేతగా ఉన్న ఎడుపుల గోవింద్ దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలానికి ఎంపీపీగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సహకారంతో, స్ధానిక ప్రజాప్రతినిధులనే కాకుండా పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్పించేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారని టాక్ నడుస్తోంది. మునుగోడులో ప్రధానంగా తన సామాజికవర్గం నేతలను టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేయించడంతోపాటు మర్రిగూడ మండలంలో కూడా గోవింద్ కీలకంగా వ్యవహరించారు. గతంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా ఎడుపుల గోవింద్ యాదవ్ తనదైన శైలిలో పనిచేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మరింత ఊత్సాహాన్నిచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి అక్కడ పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఆపరేషనర్ ఆకర్ష్‌లో కీలకంగా వ్యవహరించిన ఎడుపుల గోవింద్‌కు కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలపడంతో టీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. మొత్తంగా మునుగోడు టీఆర్ఎస్ విజయంలో, ప్రతి అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుందనడానికి మాజీ ఎంపీపీ ఎడుపుల గోవింద్ యాదవ్ లాంటి నేతలు కూడా పనిచేశారని అనడానికి ఆ పార్టీ విజయమే మనకు నిదర్శనం.