ఈనెల 20న ఆరో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంకానున్న ప్రధాని మోడీ అమలవుతోన్న పథకాలు, నిధుల కేటాయింపులు, అవసరాలపై చర్చించనున్నారు. దాంతో, నీతి ఆయోగ్‌లో చర్చించాల్సిన అజెండాపై ఏపీ, తెలంగాణ కసరత్తు మొదలుపెట్టాయి. అయితే, దేశానికి దిక్సూచిలా అమలవుతోన్న పథకాలతో అజెండాను సిద్ధంచేయాలని ఆయా శాఖాధిపతులకు తెలంగాణ సీఎస్ ఆదేశించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలతో నివేదికలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, టీఎస్ ఐపాస్ లాంటి పథకాలను నీతి ఆయోగ్ అజెండాలో పెట్టాలని నిర్ణయించారు.