Praneeth Rao: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు

Praneeth Rao: లంచ్‌మోషన్ పిటిషన్‌ దాఖలు చేసిన ప్రణీత్‌రావు లాయర్‌

Update: 2024-03-20 03:04 GMT

Praneeth Rao: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు

Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు పిటిషన్‌ను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కిందికోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదన్నారు.

దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్‌లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్‌లో కాకుండా జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. బంధువులు, తన న్యాయవాదులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదని ప్రణీత్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.

గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కస్టడీని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News