నేడు ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం.. తమ సమస్యల పరిష్కారం కోసం క్యూ కడుతున్న ప్రజలు
Praja Bhavan: వస్తున్న ఆర్జీలో ఎక్కువ శాతం ధరణికి సంబంధించినవే
Praja Bhavan: ఇవాళ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం తెల్లవారుజాము నుంచే జనాలు ప్రజాభవన్‌కు క్యూ కడుతున్నారు. ఎక్కువశాతం ధరణికి సంబంధించిన ఆర్జీలే వస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి GHMC పరిధిలోని 30 సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభంకాగా.. 22 నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.