Praja Bhavan: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్
Praja Bhavan: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రగతి భవన్ వద్ద ఇనుప కంచెను తొలగించడంతో పాటు జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌గా మార్చింది.
Praja Bhavan: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రగతి భవన్ వద్ద ఇనుప కంచెను తొలగించడంతో పాటు జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌గా మార్చింది. ప్రజా భవన్‌లో కొద్ది రోజులుగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మీదట ప్రజాభవన్ భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ఉండనుంది.