Ganuga Oil Preparation: నేరెడ్ మెట్‌లో గానుగ నూనె తయారీ!
Ganuga Oil Preparation: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై ధ్యాస పెట్టడంలేదు. కల్తీ ఆహారానికి అలవాటు పడ్డారు.
Ganuga Oil Preparation | ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై ధ్యాస పెట్టడంలేదు. కల్తీ ఆహారానికి అలవాటు పడ్డారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఉన్నా తీరికలేని పనులతో కాలంతో పరిగెడుతున్నారు. అయితే ఏ ఆహారం వండాలన్నా నూనె వాడడం తప్పనిసరి. ఇది నాణ్యమైనదా కాదా అని చూసే తీరిక లేదు. అందుబాటులో ఉన్నది నూనె కొని వాడేసేవారు. అయితే కొవిడ్ దెబ్బతో నగర ప్రజలు ఇప్పుడిప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టి, డాక్టర్ సలహా, సూచనలతో గానుగ నూనె రుచి చూస్తున్నారు.
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. నేరెడ్ మెట్ కు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి.... గానుగ నూనెను తయారు చేస్తున్నాడు. ఎడ్ల సహాయంతో నూనెగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.
గానుగ నూనెను సంప్రదాయ పద్దతితో తయారు చేస్తామని ప్రభాకర్ భార్య తెలిపింది. గానుగ నూనెలో మంచి పోషకాలు ఉంటాయని చెబుతుంది. రిఫైన్డ్ ఆయిల్‌తో పోల్చుకుంటే ధర ఎక్కువే అయిన.... పోషకాలు ఎక్కువగా ఉండడంతో గానుగ నూనెనే వాడుతున్నామని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వాలు రాయితీలు కల్పించి వీరికి సబ్సిడీలు ఇస్తే తయారీని చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా నెలకొల్పే అవకాశం ఎక్కువగా ఉంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.