ఓటమి కాంగ్రెస్‌కి కొత్త కాదు.. 2023 టార్గెట్ గా అందరం కష్టపడదాం : పొన్నం ప్రభాకర్
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నిరాశపడొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. 2023 టార్గెట్ గా అందరం కష్టపడదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నిరాశపడొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. 2023 టార్గెట్ గా అందరం కష్టపడదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దుబ్బాక ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.ఈఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. రఘునందన్ రావు ఇప్పటికి మూడు సార్లు ఓడిపోయారని, ఇప్పుడు కేవలం సానుభూతితోనే గెలిచారని పొన్నం అన్నారు. ఇక ఓటమి కాంగ్రెస్‌కి కొత్త కాదు.. ఇంతకన్నా ఘోరమైన సందర్భాల్లో పడిపోయిన ప్రతీసారి చాలా సార్లు కాంగ్రెస్ బలంగా నిలబడిందని అన్నారు.
ఇక అటు సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.