Ponnam Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణతో బీఆర్ఎస్‌కు దడ పుడుతుంది

Ponnam Prabhakar: ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరిపిస్తామని ముందే చెప్పాం

Update: 2024-01-10 04:40 GMT

Ponnam Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణతో బీఆర్ఎస్‌కు దడ పుడుతుంది

Ponnam Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపితే బీఆర్ఎస్‌కు దడ పుడుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 90 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలల కూడా ఉపయోగపడలేదన్నారు. ప్రాజెక్టులో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముందే చెప్పామన్నారు మంత్రి పొన్నం. అదే సందర్భంలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌పై కూడా పొన్నం ఫైర్ అయ్యారు. వినోద్‌కుమార్ నిజాయితీ పరుడయితే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జెన్‌ కోతో పాటు ఇతర విభాగాల్లో అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వదిలేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా భూ అక్రమాలపై చర్యలు చేపడతామని తెలిపారు మంత్రి పొన్నం.

Tags:    

Similar News