Vaman Rao: వామన్ రావు హత్య నిందితులను కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

Vaman Rao: నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కల కుమార్ కు 14 రోజులు రిమాండ్ విధించిన మంథని కోర్టు

Update: 2021-02-20 01:59 GMT
వామన్ రావు హత్య నిందితుడు బిట్టు శ్రీను (ఫైల్ ఫొటో)

Vaman Rao: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను మంథని కోర్టు ఎదుట హాజరు పరిచారు. నిందితులకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. హత్య కేసులో ఇంకా ఎవరెరవరి ప్రమేయం ఉందనేది పోలీసు విచారణలో తేలనుంది. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచే ముందు మంథని కోర్టు దగ్గర హై అలర్ట్ నెలకొన్నది. గుంజపడుగు గ్రామానికి చెందిన పలువురు కోర్టు వద్దకు తరలి వచ్చారు.

మరోవైపు నిందితులను పోలీసులు హత్య జరిగిన ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో ఏ1గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్‌, ఏ2గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్‌ను చేర్చారు. నిందితులపై ఐపీసీ 302, 341, 120బి రెండ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హత్యా ఘటనలో మరో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకు మేనల్లుడు. హత్యకు సంబంధించి వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లు బిట్టు శ్రీనుపై ఆరోపణలున్నాయి. పుట్ట మధు తల్లిపేరుతో నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతలను బిట్టు శ్రీను చూస్తున్నారు. బిట్టు శ్రీని అరెస్ట్ తో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీనును అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. పుట్ట మధును విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇంకా ఈ హత్య కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది పోలీసుల విచారణలో తేలనున్నది. 

Tags:    

Similar News