Online Food Delivery: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి అనుమతి
Online Food Delivery: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి పోలీసులు అనుమతి ఇచ్చారు.
Online Food Delivery: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ కి ఎంట్రీ ఉందంటూ పోలీసులు ప్రకటించారు. శనివారం నుంచి లాక్‌డౌన్ కఠినతరం చేయడంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు.
బాయ్స్ ని అడ్డుకోవడంపై మంత్రి కేటీఆర్‌కు ఈ కామర్స్ ట్వీట్ చేసింది. ఈ కామర్స్ సంస్థల ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. ఆన్‌లైన్ ఫుడ్‌కు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ముగ్గురు కమిషనర్లతో డీజీపీ సమీక్ష జరిపారు. ఈ- కామర్స్ ద్వారా జరిగే సేవల గురించి అడిగి తెలుసుకన్నారు. ఆ తర్వాత అనుమతి ఇవ్వాల్సిందిగా డీజీపీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.