Vikarabad: కలెక్టర్‌పై దాడి ఘటన.. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్..!
Patnam Narender Reddy: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
Patnam Narender Reddy: వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా.. పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సోమవారం నాడు దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు వెళ్లారు.
అయితే.. కలెక్టర్, అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో.. అధికారులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. మాట మాట పెరగడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు.. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి సహా పలువురు అధికారులపై దాడి చేశారు రైతులు. కలెక్టర్, అధికారుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 55 మంది అరెస్ట్ కాగా.. ఇవాళ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.