తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఉద్రిక్తత..
Teenmar Mallanna: భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
Teenmar Mallanna: భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలో గ్రామసభ నిర్వహించగా తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు రైతులకు మద్దతుగా మల్లన్న మట్లాడుతూ... బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. 80ఏ జీవోను రద్దు చేసే వరకు రైతులు ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడాలన్నారు. మల్లన్నను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర తోపులాట మధ్య మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.